123456789…. అక్షయ అనగా,
క్షయము లేనిది, ఎప్పటికీ పెరుగునది అని అర్ధం.
ఈరోజున
పుస్తకాలు కొనడం వలన జ్ఞానవృధ్ధి,
బియ్యం కొనడం వలన మాతా
అన్నపూర్ణేశ్వరిని ఇంటికి ఆహ్వానించినట్టుగా,
ఉప్పు కొనడం వలన
ఇంటిలోని నెగెటివిటీని పారద్రోలుట,
నూనె ను కొనడం
మంచి ఆరోగ్యకరమైన వంటకు ప్రతీకగా, చివరికి
పంచదార కొనడం ఇంటిలోకి పాజిటివ్
ఎనర్జీ ని ఆహ్వానించుట.
జ్ఞానం, ఆరోగ్యం, సమృధ్ధి, నెగెటివిటీని పారద్రోలి, పాజిటివ్ ఎనర్జీ ని ప్రవేశపెట్టడం, అనేవి
ప్రతి ఇంటిలోనూ తప్పనిసరి. అందుకే అక్షయ తృతీయనాడు ఇవన్నీ
మనం చేయదగ్గ పనులు.
కానీ ఇప్పుడు కాలం
మారి అందరూ బంగారం కొనడం
ఆరంభించారు.
అక్షయ తృతీయ నాడు
అన్నదానం చేయటం చాలా మంచిది.
బంగారు దుకాణాల వారు తమ వ్యాపారాభివృధ్ధి
చేసే ఎన్నో గిమ్మిక్కులలో ఇదోకటి.
ప్రజలందరూ వారి ప్రకటనలకి మోసపోయి,
గొర్రెల్లా బంగారం కొనుగోలు కై ఆత్రపడి బంగారం
వ్యాపారుల వద్దకు పరుగెడుతున్నారు .
దాని
బదులుగా పేదసాదలకు, అన్నార్తులకు అన్నదానం చేయండి. నిజానికి ఈరోజు బంగారం కొనాలి
అనేది పూర్వకాలం నుంచీ వస్తున్న ఆచారం
కాదు.
"అక్షయ
తృతీయ" శుభాకాంక్షలు.