Mother s Day Messages in Telugu
అమ్మ..
....
అమ్మ ..
అమ్మకో రోజా..
అమ్మకోసమో రోజా..
అమ్మతనానికో రోజా...
అమ్మని తలవని రోజుంటుందా
అమ్మలేని లోకముందా
అమ్మేగా సృష్టికి ఆదిరూపం
అమ్మలేని సృష్టి అంతమేగా
అమ్మేగా ఆది రూపం
అవని ఆరంభం అమ్మేగా..
అందుకే అన్ని రూపాలలోనూ
అమ్మను చూడమన్నది మన సంస్కృతి
అమ్మ...
నానమ్మ...
అమ్మమ్మ......
అత్తమ్మ....
పెద్దమ్మ...
చిన్నమ్మ...
వదినమ్మ...
చెల్లెమ్మ...
ఎందరు అమ్మల్ని ఇచ్చిందో
కదా మన సాంప్రదాయం..
చివరికి
పక్కింటమ్మ....
ఎదిరింటమ్మ..
అనటం మన విలువలకు నిదర్శనం
ఏ దేశ సంస్కృతి ఇచ్చింది
'స్త్రీ' కి ఇంతటి విలువ..
ప్రతీ పిలుపులోనూ అమ్మతనాన్నే
చూపే బంధాల ఔన్నత్యం.
అంతటి చరిత కలిగిన
సాంప్రదాయానికీ తప్పలేదీ..
ఈ ఒక్క రోజు మాతృదినోత్సవ
వేడుకల కోలాహలం.
అ'నురాగం అమ్మ
'ఆ'త్మీయత అమ్మ
'ఇ'ల్లు అమ్మ
'ఈ'క్షణిక అమ్మ
'ఉ'గ్గుపాలు అమ్మ
'ఊ'యల అమ్మ
'ఋ'క్కు అమ్మ
'ఎ'త్తుకొను అమ్మ
'ఏ'ఱువ అమ్మ
'ఐ'క్యము అమ్మ
'ఒ'ంటరి అమ్మ
'ఓ'దార్పు అమ్మ
'ఔ'షధము అమ్మ
'అం' దరి అమ్మ
'అః ' అమ్మ
మాతృమూర్తులందరికి పాదాభివందనం
అమ్మకు ప్రేమతో.
అమ్మ ఒడిలో గడిపే ప్రతిక్షణమూ అద్భుతమే. అమ్మ అంటూ పిలిచే ప్రతి మాట అమృతమే. ఊపిరిపోసుకున్న క్షణం నుంచి బిడ్డల సేవలో తరిస్తుంది అమ్మ. అన్నింట్లో స్ఫూర్తిగా, అండగా నిలిచే అమ్మకు.. బిడ్డలందరూ ప్రేమతో ఇచ్చే కానుకే ‘మాతృ దినోత్సవం’. ఈ రోజు మదర్స్ డే. ఈ సందర్భంగా అమ్మకు అపురూపమైన కానుక ఇచ్చేద్దాం.
కమ్మని వంట....
అమ్మ చేతి వంటలో రుచి మరెక్కడా దొరకదు. తన బిడ్డలు ప్రయోజకులు కావాలని ఎన్నెన్నో కథలు చెబుతూ తినిపిస్తుంది. అన్నం తిననని మారాం చేస్తే లాలించి.. బుజ్జగించి.. ప్రేమతో గోరుముద్దలు పెడుతుంది. కోరిన వంటను క్షణాల్లో చేసి.. కొసరి కొసరి తినిపించే అమ్మ కోసం ఈ రోజు మీరే స్వయంగా ఓ వంటకాన్ని వండేయండి. మీ చేతులతోనే గోరుముద్దలు కలిపి ‘అమ్మ కడుపు చల్లగా..’ అంటూ తినిపించండి. మీ ఆప్యాయత చూస్తే చాలు అమ్మ కడుపు నిండిపోతుంది. ‘మేం వండలేం కదా..!’ అంటారా. దానికీ ఓ మార్గం ఉంది. మీ కిట్టీ బ్యాంకులో పొదుపు చేసుకున్న డబ్బు తీసుకోండి. అమ్మతో పాటు మంచి రెస్టారెంట్‌కు వెళ్లి తనకిష్టమైనవి ఆర్డర్ చేసి డిన్నర్ పార్టీ చేసుకోండి.
అక్షరాల్లో అమ్మ ప్రేమ...
మీరు అ.. ఆ.. లు దిద్దిన రోజున అందరికన్నా ఎక్కువ సంతోషించేది అమ్మే. అక్షరాభ్యాసం రోజునే మీరు ఏ డాక్టరో.. ఇంజనీరో.. అయిపోయినట్టు ఆనందిస్తుంది. అలాంటి అమ్మప్రేమపై అందమైన మాటలతో కవిత ఒకటి రాసి తనకు అందించండి. మీరు రాసింది చిట్టిపొట్టి కవితే అయినా.. అమ్మకది మహాకావ్యంలా కనిపిస్తుంది.
లాలిజో.. లాలీజో..
ప్రతి పసివాడు వినే తొలి సంగీతం అమ్మ లాలిపాటే. ‘వటపత్ర శాయికి వరహాల లాలి..’ అని జోలపాట పాడుతూ కునుకమ్మను కంటి మీదికి చేరుస్తుంది అమ్మ. క్షణం తీరికలేకుండా పనులతో సతమయ్యే అమ్మకు ఈ రోజు ఇంటి పనుల్లో సాయం చేయండి. ఆ తర్వాత హాయిగా కబుర్లు చెప్పండి. నవ్వించండి. మంచి జోలపాట పాడి నిద్రపుచ్చండి. మీ చేష్టలు చూసి సంబరపడిపోయే అమ్మ.. మీ చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఎంచక్కా నిద్రలోకి జారుకుంటుంది.
అమ్మకు అమ్మను గుర్తు చేయండి...
అమ్మ ఆనందంతో ఆశ్చర్యపోయేలా చేయాలని ఉందా. అయితే మీ అమ్మగారిని వాళ్లమ్మతో అదే మీ అమ్మమ్మతో కలిసేలా ప్లాన్ చేయండి. కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడేలా చూడండి. లేదా.. మీ అమ్మమ్మ ఫొటోను టీకప్పుపై ముద్రించి అమ్మకు బహుమతిగా అందించండి. అప్పుడు మీ అమ్మ ముఖం చూడాలి.. వేయి దీపాల కాంతులతో మెరిసిపోతూ కనిపిస్తుంది.
అచ్చెరువొందే చిత్తరువు...
పిల్లలకు అమ్మను మించిన రోల్‌మోడల్ ఎవరుంటారు. చిన్నప్పటి నుంచి అమ్మను చూస్తూనే ఉన్నాం కదా.. సరదాగా అమ్మ బొమ్మను గీసి తనకు బహుమతిగా ఇవ్వండి. ప్రేమతో మీరు గీసిన చిత్తరువును చూసి అమ్మ అచ్చెరువొందక మానదు. ఆమె కళ్లలో ఆనంద భాష్పాలు రాకమానవు. బొమ్మలు వేయలేం అనుకునేవారు.. అందమైన గ్రీటింగ్ కార్డు కొనివ్వండి.
పాటల పల్లకిలో...
తెలుగు సినిమాల్లో అమ్మ గొప్పదనం చాటే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని సేకరించి అమ్మకు వినిపించి మీ అభిమానాన్ని చాటుకోండి. ఈ రోజు చూపే ప్రేమలో రవ్వంతైనా ప్రతి రోజూ అమ్మపట్ల చూపండి. అమ్మకు ఎదురు సమాధానం చెప్పకండి. అమ్మ మాట వినండి. అమ్మతో ఆప్యాయంగా మాట్లాడండి. బాగా చదువుకోండి. అమ్మ కలలను నిజం చేయండి. మీ విజయం కన్నా అమ్మకు మీరిచ్చే విలువైన బహుమతి మరొకటి లేదు
ఆత్మీయులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు...
తెలుగు సినిమాల్లో అమ్మ గొప్పదనం చాటే పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని సేకరించి అమ్మకు వినిపించి మీ అభిమానాన్ని చాటుకోండి. ఈ రోజు చూపే ప్రేమలో రవ్వంతైనా ప్రతి రోజూ అమ్మపట్ల చూపండి. అమ్మకు ఎదురు సమాధానం చెప్పకండి. అమ్మ మాట వినండి. అమ్మతో ఆప్యాయంగా మాట్లాడండి. బాగా చదువుకోండి. అమ్మ కలలను నిజం చేయండి. మీ విజయం కన్నా అమ్మకు మీరిచ్చే విలువైన బహుమతి మరొకటి లేదు
ఆత్మీయులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు...